ప్రస్తుతం దైవ చింతనలో ఉన్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. గుళ్లుగోపురాలు తిరుగుతూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇంతలోనే ఆయన ఓ విడడంలో చిక్కుకోవడం హాట్ టాపిక్ అయింది.
శ్రీకాళహస్తి: సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శుక్రవారం నాడు అయన శ్రీ కాళహస్తిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కి హారతి ఇచ్చారు. అనవాయితీ ప్రకారం పూజారులు తప్ప మరి ఎవ్వరు ఇవ్వకూడదు. సాయి ధరమ్ తేజ్ హారతి ఇవ్వడంపై భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఎలా అనుమతి ఇచ్చారు అంటు ఆలయ అధికారులు పై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.