రష్యా దీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా- ఉక్రెయిన్ యుద్ధం 17 నెలలైనా ఎంతకీ సద్దుమణగడం లేదు. ముందు రష్యా మాత్రమే ఉక్రెయిన్‌పై దాడి చేస్తే, ఇప్పుడు ఉక్రెయిన్ కూడా నెమ్మదిగా రష్యాపై దాడులు చేయడంలో వేగాన్ని పెంచుకుంటూ వస్తోంది. ఉక్రెయిన్ దాడి గురించి రష్యా ఒక సమాచారం ఇచ్చింది. ఉక్రెయిన్ తమపై అర్థరాత్రి డ్రోన్ దాడి చేసిందని రష్యా తెలిపింది. రష్యా ప్రకారం, ఉక్రేనియన్ డ్రోన్‌లు అర్థరాత్రి మాస్కోలోని రెండు నివాసేతర భవనాలు, క్రిమియాలోని ఆయుధ గిడ్డంగిపై దాడి చేశాయి.
Russian forces shot down Ukrainian drones
దీంతో అప్రమత్తమైన రష్యా సేనలు ఉక్రెయిన్ డ్రోన్‌లను కూల్చివేసినట్లు తెలిపింది. కూల్చివేసిన రెండు డ్రోన్లలో ఒకటి మాస్కోలో ఉన్న రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమీపంలో పడగా, మరోటి కార్యాలయ భవనంపై పడిందని ఈ ఘటనలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని రష్యా సైనిక వర్గాలు వెల్లడించాయి.
Also Read: హెచ్ఏఎల్షేర్లలో భారీ పెరుగుదల ఐదేళ్లలో ఐదు రెట్లు
ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఇప్పటి వరకు భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీనితో పాటు, ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు కూడా ధ్వంసమయ్యాయి. కానీ ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, ఉక్రేనియన్ సైన్యం ఈ యుద్ధంలో రష్యా సైన్యాన్ని నిరంతరం ఎదుర్కొంటోంది. ఇరుదేశాల యుద్ధం వల్ల ఇరుదేశాలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.