Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జపాన్ లో ఆర్ఆర్ఆర్ 100 రోజులు

0

హైదరాబాద్, జనవరి 28, (న్యూస్ పల్స్): ప్పుడు వంద రోజుల సినిమా అనే పదం విని చాలా రోజులైంది. వంద కాదు కదా, కనీసం 50 రోజులు కూడా సినిమాలు ఆడటం లేదు. అంత కంటే ముందు ఓటీటీ వేదికల్లో విడుదల అవుతుండటంతో జనాలు ఆ తర్వాత థియేటర్లకు వెళ్ళడం మానేశారు. ‘మావోడి సినిమా 114 సెంటర్స్‌లో 100 రోజులు ఆడింది! అదిరా మావోడంటే’ లాంటి డైలాగులు తెలుగు సినిమా ప్రేక్షకుల నుంచి విని ఓ పది, పదిహేనేళ్ళు దాటింది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు… ఇండియా అంతా అదే ట్రెండ్! ఇప్పుడు అందరూ ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గురించి చాలా గొప్పగా చెబుతున్నారు. ఎవరూ వంద రోజుల గురించి ఆలోచించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఓ తెలుగు సినిమా విదేశాల్లో, అదీ జపాన్‌లో వంద రోజులు ఆడటం అంటే చాలా గొప్ప విషయమే కదా! అటువంటి అరుదైన రికార్డును ‘ఆర్ఆర్ఆర్’ క్రియేట్ చేసింది. అవును… ‘ఆర్ఆర్ఆర్’ సినిమా జపాన్‌లో దిగ్విజయంగా వంద రోజులు ఆడింది. ఈ విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి వెల్లడించారు.

గత ఏడాది అక్టోబర్ 21న అక్కడ సినిమా విడుదల అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటికీ ప్రేక్షకులు సినిమా చూస్తూనే ఉన్నారు. 42 కేంద్రాల్లో నేరుగా… 114 కేంద్రాలో షిఫ్ట్ ల వారీగా 100 రోజులను పూర్తి చేసుకుంది ‘ఆర్ఆర్ఆర్’. ఇండియా, అమెరికా తర్వాత ఆ స్థాయిలో మన సినిమాను జపాన్ ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు.జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ విడుదలైనప్పుడు ప్రచార కార్యక్రమాల కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి వెళ్ళారు. అప్పుడు అక్కడి ప్రేక్షకులు మన వాళ్ళ మీద ప్రేమ, అభిమానం చూపించారు. రాజమౌళి తీసిన ‘బాహుబలి’కి కూడా జపాన్ నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. అప్పట్లో కొంత మంది ప్రేక్షకులు అయితే ఇండియాకు వచ్చి మరీ ప్రభాస్, జక్కన్నను కలిసి వెళ్ళారు. రామ్, భీమ్ క్యారెక్టర్లు తమ సొంత సంస్కృతిలో భాగం అన్నట్లు జపాన్‌లో ప్రతీ చోట తారక్, రామ్ చరణ్ లు కనిపిస్తున్నారు. వాళ్ల పండుగలు, వాళ్ల కల్చర్, ఫుడ్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ వాట్ నాట్… ఆర్ఆర్ఆర్ బొమ్మలకు కాదేదీ అనర్హం అన్నట్లు ఎక్కడా చూసినా RRR హీరోలే.

యానిమేషన్ కి ప్రాణం ఇచ్చే జపాన్ లో రీసెంట్ టైమ్ లో RRR మీద వచ్చినన్ని బొమ్మలు మిగిలిన సినిమాల మీద వచ్చి ఉండవు. అసలు ఓ స్ట్రైట్ ఫిలిం జపాన్ లో ఇన్ని రోజులు ఆడటం అంటే పెద్ద విషయమే. జపాన్‌లో ట్యాక్సులు ఎక్కువ. సో… సినిమాకు వచ్చే రెవెన్యూ చాలా తక్కువ. థియేటర్లలో సినిమాలకు లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది. కానీ, RRR ఆ రికార్డులను చెరిపేసి వంద రోజుల పండుగను జరుపుకుంటోంది. ఇప్పటి వరకు జపాన్‌లో విడుదలైన అన్ని ఇండియన్ సినిమాల రికార్డులను ‘ఆర్ఆర్ఆర్’ తుడిచి పెట్టేసింది. సుమారు 40 కోట్ల రూపాయలను వసూలు చేసింది. గతంలో ‘ముత్తు’ పేరు మీద ఉన్న రికార్డును దాటేసి చాలా ఎత్తున నిలబడింది. వంద రోజుల పండుగపై రాజమౌళి సైతం తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు వంద రోజులు అనే పేరు ఇండియన్ సినిమాల్లో వినబడి ఎన్ని రోజులైందంటూ ట్వీట్ చేశారు. జపాన్ ప్రజలకు RRR ను ఇంత ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు జక్కన్న.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie