గత కొద్ది రోజులుగా వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాట, భారీ వర్షాలకు కుళ్ళి పోయి చెత్తుకుప్పకు చేరుతోంది. ఈ ఏడాది టమాట పంట రైతులు చాలామంది కోటీశ్వరులయ్యారని వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుతం పడుతోన్న వర్షాలతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మార్కెట్లకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గి పోవడం, మరోపక్క అధిక ధరల కారణంగా టమాటా కొనేందుకు ఆసక్తి చూపించకపో వడంతో వ్యాపారులు కుళ్ళిన టమాట స్టాకును చెత్తకుప్పులో పారబోస్తున్నారు.
వరంగల్ లోని లక్ష్మీపురం మార్కెట్ వ్యాపారులు పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటక మార్కెట్ల నుంచి భారీ ఎత్తున టమాటాలు తెప్పించారు. అయితే వర్షం కారణంగా ఒక్క రోజులోనే టమాటలు దెబ్బతింటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చేసేదేమీ లేక చెత్తుకుండిలో పడేసినట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.