చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ నగల దుకాణంలో చోరి జరిగింది. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద ఉన్న పుఖ్రజ్ Robbery in Lal Chand Jewelery Shop లాల్ చంద్ జ్యువలారీ షాప్ లో చోరీ జరిగింది. సోమవారం అర్ధ రాత్రి సమయం లో నగల దుకాణానికి అనుకొని ఉన్న వస్త్ర దుకాణం గోడ కు కన్నం వేసి నగల దుకాణం లోకి దుండగులు ప్రవేశించారు. మంగళవారం ఉదయం దుకాణం యజమాని రావడంతో ఘటన తెలిసింది. పోలీసులు, Cyberabad Clues Team సైబరాబాద్ క్లూస్ టీమ్ ఘటన స్థలికి చేరుకున్నారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.