- వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టుల రద్దు.. 40వేల ఉద్యోగాలు కనుమరుగు..
- వీఆర్ఎల క్రమబద్దీకరణపై హర్షం.
- కాంగ్రెస్ వచ్చాక వీఆర్ఓ, వీఆర్ఎలను రెవెన్యూ లోకి తిరిగి తీసుకువస్తాం: ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి..
ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలకు తోడుగా నిలిచేది రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని, రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి రెండు కండ్లు..చెవుల లంటివని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ తో పాటు, అదనంగా పోస్టులు భర్తీ చేస్తారని భావించి తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు,నిరుద్యోగులు బాటలు వేశారని,
అదనంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని, ఉన్న ఉద్యోగాలను రద్దు చేసి నిరుద్యోగులపొట్టగొడుతున్నారని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా..వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో వీఆర్వో పోస్టులు18000, వీఆర్ఎ పోస్టులు 22000 పోస్టులు సర్దుబాటు చేసి 40 వేల ఉద్యోగాలు కనుమరుగు చేశారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 40 వేల ఉద్యోగాలు రద్దు చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారని, తెలంగాణ ఇందుకే సాధించుకున్నామా..అని ప్రశ్నించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం. చేయకుండా..వీఆర్ఓ పోస్టులు రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు.
రెండేళ్లుగా వీ ఆర్ ఎ లు ఉద్యమించడం తో ఎట్టకేలకు ప్రభుత్వం వీఆర్ఎలను క్రమబద్దీకరించడం పై ఎమ్మెల్సీ హర్షం వ్యక్తం చేశారు.తహశీల్దార్ కు రిజిస్ట్రేషన్ అప్పగించడంతో ప్రకృతి వైపరిత్యాల నష్టం అంచనా వేసేందుకు కూడా
క్షేత్ర స్థాయిలో పర్యటించే వారు కనుమరుగయ్యారన్నారు.ఖరీఫ్ ఆరంభించి నెల రోజులు గడుస్తున్నా..నేటికీ పెట్టుబడి సాయం పూర్తిగా అందించలేదు..గత నెల 26 నుండి రోజుకో ఎకరం చొప్పున రైతు బందు ఇస్తామని చెప్పి.. నెల రోజులు గడుస్తున్న ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
వీఆర్ఎ లను లష్కర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టంట్ లుగా నియమించనుండడంతో తహసిల్డార్ గా పదోన్నతి పొందే అవకాశాలు కోల్పోతున్నారని అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం..వీఆర్ఎ, వీఆర్ఓలను రెవెన్యూ శాఖలో తిరిగి కొనసాగించడం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచి అమలు చేస్తామని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే రైతుబందు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి బండ శంకర్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్,రేపల్లె హరికృష్ణ, పుప్పాల అశోక్, చందా రాధాకిషన్, గుంటీ జగదీశ్వర్,జున్ను రాజేందర్, పిసిసి ఎన్ ఆర్ ఐ సెల్ కన్వీనర్ చాంద్ పాషా, మామిడిపల్లి మహిపాల్ పాల్గొన్నారు.