జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కు వినతి
Request to Minister KTR to allot houses for journalists
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు పలువురు పాత్రికేయులు వినతిపత్రం సమర్పించారు. సోమవారం ఉప్పల్ శిల్పారామం లో చేనేత భవన్ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను స్ధానిక టీయూడ బ్ల్యూజే నేతలు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఉప్పల్ మండలం విలేకరులకు గతంలోఇచ్చిన ఇళ్ల పట్టాల సమస్యను పరిష్కరించాలని, ఉప్పల్ ప్రెస్ క్లబ్ భవనం నిర్మించాలని ఈ సందర్భంగా కే టీ ఆర్ కు ఇచ్చిన వినతి పత్రం లో కోరారు.
తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కే టీ ఆర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో… టీయూడబ్ల్యూజే ఉప్పల్ నియోజక వర్గం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి యూనియన్ నాయకులు తిరుపతి రెడ్డి , చంద్ర మౌళి తదితరులు ఉన్నారు