రేణిగుంట మండలం కరకంబాడీ – అమరరాజా ఫ్యాక్టరీ గోడ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతం నుంచి అమరరాజా ఫ్యాక్టరీ గోడ వరకు చిరుత రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అటవీ ప్రాంతం వైపు నుంచి ఇళ్లకు సమీపంలో పొదల్లో చిరుత దాగివుండడంతో ఏ క్షణంలోనైనా ఇళ్ల మీదకు వస్తుందనే ఆందోళనలో స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కరకంబాడీ రోడ్ల చుట్టూ నాన్ వెజ్ వ్యర్థాలను కుప్పలు కుప్పలుగా వదలి వెళ్తుండడంతో అటవీప్రాంతంలో నుంచి జనసంచారంలోకి చిరుత వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందినా అటవీ అధికారులు స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు.