Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

హైదరాబాద్ లో తగ్గిన రియల్  జోరు.

0

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు మందగించాయి. ఎన్నికలు, జీవో 111, ఇతర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో క్రయ, విక్రయాలు తగ్గినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం మందగించినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్స్ అమ్మకాలు తగ్గాయి. వ్యవసాయ భూముల విక్రయాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. కరోనా తర్వాత రెండేళ్ల పాటు రియల్ ఎస్టేట్ రంగం టాప్ గేర్ లో నడిచింది. అయితే గత కొంతకాలంగా రాష్ట్రంలో భూములు, స్థిరాస్తి అమ్మకాలు తగ్గినట్లు తెలుస్తోంది. జీవో 111 ఎత్తివేసిన ప్రాంతాలతో పాటు నగరంలోని కీలక ఏరియాల్లో అమ్మకాల జోరు తగ్గినట్లు నిపుణులు అంటున్నారు.

అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.

వెంచర్లు, వందల ఎకరాలను ఉమ్మడిగా విక్రయానికి పెట్టినా కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు రిజిస్ట్రేషన్లే నిదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయేతర భూముల విక్రయాలు గతేడాదితో పోలిస్తే లక్షకు పైగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది జూన్నాటికి 1.80 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరగగా, ఈసారి 75 వేలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు.వచ్చే రోజుల్లో అమ్మకాలు మరింత మందగించే పరిస్థితులు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం నేతలు భూములు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అయితే రేట్లు చుక్కల్ని తాకడంతో మధ్యతరగతి, సామాన్యులు కొనుగోలు వెనకాడుతున్నారు. కొందరు రియల్ వ్యాపారులు బిజినెస్ కోసం స్థలాలు తీసుకునేందుకు రెడీగా ఉన్నప్పటికీ విధానపర నిర్ణయాలతో స్పష్టత రాని క్రమంలో కాస్త వెనక్కి తగ్గుతున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కారణంగా స్థిరాస్తి వ్యాపారులు, పెట్టుబడిదారులు భూములు కొనేందుకు ముందుకు రావడం లేదని సమాచారం. ప్రభుత్వం మారితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయోననే ఆలోచనతో వారు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌ తో పాటు స్థానిక ఎన్నికలు ఉండడంతో భూముల క్రయ, విక్రయాలు తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

 

రియల ఎస్టేట్ కు రాజకీయంతో దగ్గర సంబంధం ఉండడంతో ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపించరువ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గుదల నమోదైందని అధికారులు వెల్లడిస్తున్నారు. అగ్రికల్చర్ భూముల విషయంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 1,47,401 అప్లికేషన్లు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం దరఖాస్తుకు వచ్చాయి. ఇందులో పార్టిషన్, సక్సెషన్, నాలా కింద వచ్చినవి దాదాపు 40 వేలు ఉన్నట్లు సమాచారం. లక్ష డాక్యుమెంట్లు మాత్రమే క్రయ, విక్రయాలు జరిగాయి.

 

గతేడాది ఏప్రిల్ 1 నుంచి జూన్ 16వ తేదీ వరకు పార్టిషన్, సక్సెషన్, నాలా మినహాయించి 1.51 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే 50 వేల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు తగ్గినట్లు తెలుస్తోంది. వ్యవసాయేతర భూములు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ 16 దాకా 5.30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ ఏడాది అవి 4 లక్షల వద్దే ఉండిపోయాయి.మే నెల ప్రారంభం వరకు హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాల రిజిస్ట్రేషన్లు జోరుగా సాగాయి. జీవో 111 రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో రిజిస్ట్రేషన్లు కాస్త మందగించాయి.

ఎమ్మార్వోపై గిరిజనలు దాడి.

111 జీవో ఎత్తివేస్తే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందని భావించారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మే 18న కేబినెట్ సమావేశంలో 84 గ్రామాల్లో నాలా, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్‌‌కు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతాల్లో హెచ్ఎండీఏ పరిధిలోని భూములకు ఉన్న నిబంధనలు‌ ఉంటాయని ప్రభుత్వం చెప్పినప్పటికీ అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. హెచ్ఎండీఏ నిబంధనలు ఆ గ్రామాల్లో అమలు చేస్తే కోర్టులు, ఎన్జీటీ నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం ఉండడంతో కొనుగోలు దారులు కాస్త జంకుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie