- ఆశావాహులకు ఆశా కిరణం ఏ ఐ ఎఫ్ బి
- ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న పలువురు నేతలు
- సత్తా చాటాలని డిసైడ్ అయిన అధినాయకత్వం
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర శాఖ ఈసారి ఎన్నికల్లో తమ సత్తా చాటాలని వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకు వెళుతుంది. ఈసారి ఎన్నికల్లో అధిక సీట్లు దక్కించుకొని అసెంబ్లీలో తన ప్రాబల్యాన్ని చాటాలనుకుంటుంది. అందుకు తగ్గట్టుగానే జాతీయ నాయకత్వం రాష్ట్ర శాఖ కు పలు కీలక సూచనలు చేస్తుంది. ఈసారి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని డిసైడ్ అయింది. అనుకున్నట్టుగానే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ల కోసం కొందరు బహిరంగంగా దరఖాస్తులు చేసుకోగా మరికొందరు తమ నియోజకవర్గాలను సీక్రెట్ గా రిజర్వ్ చేసుకుంటున్నారు. జాతీయ పార్టీ కావడంతో బ్యాలెట్ పై ప్రాధాన్యత క్రమంలో ఉండడం, సింహం గుర్తు ఇప్పటికే ప్రజల్లో ఉండడంతో ఆశావాహులు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధాన పార్టీలో టిక్కెట్లు దక్కని రెబల్స్ కు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆశాకిరణంగా కనబడుతుంది. ఈసారి ప్రధాన పార్టీలో ఒక్కో నియోజకవర్గంలో నుండి ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఎవరికి టిక్కెట్టు దక్కుతుందోనన్న అయోమయంలో ఆశవాహులు ఉన్నారు. నమ్ముకున్న పార్టీ టికెట్ నిరాకరిస్తే సింహం గుర్తు ద్వారా తమ ప్రాబల్యాన్ని చాటుకోవాలనుకుంటున్నారు.
అధికార BRS party బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 నియోజకవర్గాలలో టిక్కెట్లను ప్రకటించింది. ఒక్క నియోజకవర్గము నుండి ఆశవాహుల సంఖ్య అధికంగా ఉంది. టికెట్ల కేటాయింపు జరగడంతో బయటకు చెప్పుకోలేక లో లోపల చాలామంది ఆశవాహులు రగిలిపోతున్నారు. పార్టీ మారడమా లేక రెబల్ గా బరిలో నిలవడం అనే సందిగ్ధములో ఉన్న వారి సంఖ్య అధికం. ఈసారి బిఆర్ఎస్ పార్టీ వారే ఎక్కువమంది సింహం టిక్కెట్లు కోరుకుంటున్నట్లు విశ్వాసనీయ సమాచారం. అలాగే Congress party కాంగ్రెస్ పార్టీలో సైతం ఇలాంటి పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ఈసారి టికెట్ల కేటాయింపులో Karnataka Strategy కర్ణాటక స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఎవరికి టికెట్ వరిస్తుందో తెలియని పరిస్థితిలో ఆశవాహులు ఉన్నారు. దీంతో ఎవరికి వారే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి సైతం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అవగతం అవుతుంది. ఈ పరిస్థితులను అన్నింటిని తమకు అనుకూలంగా మలుచుకుని రాష్ట్రవ్యాప్తంగా టికెట్ల కేటాయింపు లో తగు జాగ్రత్తలు తీసుకొని వీలైనాన్ని ఎక్కువ టికెట్లను హస్తగతం చేసుకోవాలనుకుంటుంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో సైతం ఒక్కో నియోజకవర్గం నుండి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.
గెలిచిన వారిని నిలుపుకోవాలి
All India Forward Block Party ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను నిలుపుకోవాలి. గెలిచిన అభ్యర్థులు పార్టీలో కొనసాగకుండా అధికార పార్టీల వైపు మొగ్గు చూపుతుండడంతో ఏ ఐ ఎఫ్ బి పార్టీ రాష్ట్రంలో నిలబడలేక పోతుంది. ఈ పరిస్థితి నుండి బయటపడడానికి పార్టీ అధినాయకత్వం కచ్చితత్వంతో కూడిన ప్రణాళికలను రూపొందించుకోవాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుంది. గతంలో కంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో మెరుగుపడింది. ఈసారి జాతీయ మహాసభలు హైదరాబాదులో జరగడంతో రాష్ట్రంపై కేంద్ర నాయకత్వం దృష్టిసారించింది. ఎలాగైనా గెలిచిన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో విప్ జారీ చేసే అధికారాన్ని కైవాసం చేసుకోవాలని చూస్తుంది. అలాగైతేనే రాష్ట్రంలో పార్టీని నిలుపుకోగలమన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికిని రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పార్టీల్లోని రెబల్స్ సింహం వేటలో పడ్డారన్నది యదార్థం.