Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

దుమ్మురేపుతున్న రవితేజ.

0

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తానేంటో సినీ ఇండస్ట్రీలో నిరూపించుకున్న హీరో రవితేజ. ఆ తర్వాత మాస్ మహారాజాగా సత్తా చాటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు రవితేజ. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు రవితేజ. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గత ఏడాది ధమాకా సినిమాతోసూపర్ అందుకున్న రవితేజ. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్నారు.

 

ఆ తర్వాత ఆయన నటించిన రావణాసుర సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. అలాగే త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో  మరో సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే తాజాగా రవితేజ రెమ్యునరేషన్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. రవితేజ ఒకొక్క సినిమాకు దాదాపు 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ వుంది.

చంద్రముఖి2 వచ్చేస్తోంది.. ఇక బాక్సాఫీస్ వేట మొదలు!;

ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ రవితేజకు ఏకంగా 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వనుందట.ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ రవితేజకు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నారట. అయితే ఇది ఒక సినిమా కోసం కాదు. పీపుల్స్ మీడియా సంస్థ రవితేజతో నాలుగు సినిమాలు చేస్తున్నారట. ఇందుకోసం 100కోట్ల రెమ్యునరేషన్ కు ఒప్పందం కుదుర్చుకున్నారని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie