Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మార్చి 31న రామయ్య కళ్యాణం

0

భద్రాద్రి, ఫిబ్రవరి 8,
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచంలంలో సీతారాముల కల్యాణ తేదీని ఆలయ అధికారులు వెల్లడించారు. మార్చి 30న కల్యాణ క్రతువు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మార్చి 31న పట్టాభిషేకం కార్యక్రమం ఉంటుంది. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 5 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా జరిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి కళ్యాణ తలంబ్రాలు కలిపే వేడుక, వసంతోత్సవం, డోలోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్సవాలు, కల్యాణం, పట్టాభిషేకాన్ని భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేసేందుకు అధికారులు తలమునకలయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ ఏడాది రాము వారి కల్యాణానికి 150 క్వింటాళ్లకు పైగా బియ్యం, ఒక క్వింటాకు పైగా ముత్యాలతో తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. గోదావరి, గంగాధర, శ్వేత పుష్కరిణి, నర్మద, పూరిలోని సముద్రం తీర్థాన్ని తూర్పు దిక్కు నుంచి తీసుకురానున్నారు.గోపీ తలాబ్‌, పుష్కర్‌, చంద్రభాగ జలాన్ని పాత్రల్లో తేవాల్సి ఉంది. ఉత్తరంలోని గంగ, యమున, సరస్వతి, సరయు, గోమతి నదులను గుర్తించారు. దక్షిణంలోని కావేరి, తామ్రపర్ణి, పినాకిని, కపిల తీర్థం, తిరుమల స్వామి పుష్కరిణి, పద్మ పుష్కరిణి, అనంత పుష్కరిణి, కల్యాణ పుష్కరిణి, ఇంద్ర పుష్కరిణి, శ్రీరామ పుష్కరిణి వంటి చోట్లకు వెళ్లనున్నారు.ముత్యాల తలంబ్రాలను ముఖ్యమంత్రి తీసుకొచ్చే సంప్రదాయం ఉన్నందున.. ఆహ్వాన పత్రికలను సిద్ధం చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పట్టు వస్త్రాలకు అధికారిక లాంఛనాల మొత్తాన్ని పెంచాలన్నారు. అయితే.. ఎవరెవర్ని ఆహ్వానించాలన్నది త్వరలో స్పష్టత వస్తుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie