మండలంలోని సింగపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువులో కొండచిలువ ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. చెరువుకు సమీపంలోని పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులకు కొండచిలువ కనిపించడంతో వెంటనే అటవీ శాఖ అధికారుల కు సమాచారం అందించారు. అధికారులు ఘటన స్థలానికి చేరుకొని కొండచిలువను చాకచక్యంగా పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు.