మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం దందాను పోలీసులు గుర్తించారు. రెండు సెంటర్స్ లో బంజారాహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకులపై కేసులు నమోదు చేసారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని హెవెన్ ఫ్యామిలీ స్పా, ది వెల్వెట్ స్పా మసాజ్ సెంటర్ స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్నట్లు నిర్దారించారు. తొమ్మిది మంది సెక్స్ వర్క ర్లను పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకులు కె.నీలిమ, ఎన్. కార్తీక్, జ్యోతి బజాజ్, సయ్యద్ యూసుఫ్ బాషాలపై కేసు నమోదు చేసారు.