కాటారం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్ కాస్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓపెన్ కాస్టు ప్రాజెక్ట్ – 2లో 6,800 టన్నులు, ఓపెన్కాస్టు-3లో 10,400 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది.మట్టి వెలికితీత పనులు కూడా నిలిచిపోయాయి.
తాడిచర్ల ఓపెన్ కాస్ట్లో
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలంలో గల తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, మైన్ మేనేజర్ కేఎస్ఎన్ మూర్తిలు తెలిపారు.వర్షాల కారణంగా ఓసీపీ లోకి నీరు చేరడంతో ఈ నెల 15 నుంచి 20 వరకు 6,60,000 క్యూబిక్ మీటర్ల ఓబీ (మట్టి) తీయాల్సి ఉండగా 1,55,494 క్యూబిక్ మీటర్ల ఓబీని తీసినట్లు తెలియజేశారు.అదేవిధంగా 42,000 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 9,320 టన్నులు తీసినట్లు వారు పేర్కొన్నారు.