మంచిర్యాల లోని పలు వార్డులకు చెందిన బీఆరెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు. 22, 30 వార్డులకు చెందిన నేతలను మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆరెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు నసీర్ తో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, మహిళలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
22వ వార్డుకు చెందిన యువకులు కూడా కాంగ్రెస్ లో చేరగా ప్రేమ్ సాగర్ రావు, సురేఖ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పట్ల ఆదరణ పెరుగుతోందన్నారు. బీఆరెస్ పై ప్రజల్లో వ్యతిరేకతభావం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే భవిష్యత్తు బాగుపడుతుందని నమ్మకం కలుగుతోందని వివరించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ ప్రతి పక్ష నాయకుడు ఉప్పలయ్య, దోమల రమేష్, కొండా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.