Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ గూటికి చేరుతున్నాము క్లారిటీ ఇచ్చిన పొంగులేటీ,  జూపల్లి..

0

బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. తాను జూలై 2 రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటానని స్పష్టం చేశారు రాహుల్‌ గాంధీని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పార్టీకి చెందిన 35 మంది కీలక నేతలు కలిశారు. ఢిల్లీ వెళ్లి వీరంతా ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత పొంగులేటి మీడియాతో మాట్లాడారు. బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చాక ఏ మార్గంలో వెళ్లాలనే అంశంపై అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నానని పొంగులేటి చెప్పారు.

 

జూపల్లిలో కలిసి అనేక సభలు సమావేశాలు నిర్వహించి, ప్రజలు ఏం కోరుకుంటున్నారనే అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. గత మూడు నెలలుగా సర్వేలు చేయించుకున్నామని, 80 శాతానికి పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని అన్నారు. ఒక పార్టీ పెట్టే అంశంపై కూడా చాలా మందిని అడిగినట్లు చెప్పారు. పార్టీ పెడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని, అలా జరగకుండా చూడాలని చాలా మంది చెప్పారని అన్నారు. తన అనుచరులు, ప్రజల అభిప్రాయం మేరకు తాను కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. పదవులు ఇవ్వలేదని పార్టీ మారానని అనడం సరి కాదని అన్నారు. తెలంగాణ వస్తే మంచి జరుగుతుందని సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు.

 

ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నా అనుకున్నది జరగడం లేదని, నీళ్లు, నిధులు, నియామకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నారని ఆవదేన వ్యక్తం చేశారు.జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. నష్టం వస్తుందని తెలిసినా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ వెంటనే తాను నడవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. వచ్చే నెల 2న రాహుల్ గాంధీ సమక్షంలో చేరతానని వెల్లడించారు.  కేసీఆర్‌ నియంతృత్వ ధోరణి పరాకాష్ఠకు చేరిందని.. మంత్రుల్ని కూడా సీఎం కేసీఆర్‌ మనుషులుగా చూడడం లేదని అన్నారు. ఈ సారి కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వకపోతే ప్రజల్ని దేవుడు కూడా క్షమించడని అన్నారు.

 

తెలంగాణ వచ్చాక తమ అంచనాలన్నీ తప్పాయని.. కేసీఆర్‌ పాలన అంతా బోగస్‌ మాటలు, పథకాలతో సాగుతోందని విమర్శించారు. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో జిమ్మిక్కులు చేస్తూ.. ప్రశ్నించే గొంతే ఉండొద్దని కేసీఆర్‌ భావిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ తీరు రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కూడా అవమానించేలా ఉందని అన్నారు. దేశంలో ఎన్నడూ లేనంతగా ప్రచారానికి ప్రజల డబ్బును ఖర్చుపెడుతున్నారని జూపల్లి కృష్ణారావు విమర్శించారు.
కనీవినీ ఎరుగని సభ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ అనుకున్న అభివృద్ధి జరగలేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనపై విమర్శలు చేశారు.

తెలంగాణలోనే షర్మిల రాజకీయం.

అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానన్న ఆయన.. జులై 2న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ బిడ్డలు ఏం కోరుకున్నారో అవి జరగలేదని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతి వల్ల ప్రజలకు దక్కాల్సినవి దక్కడం లేదన్నారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. జులై 2 ఖమ్మంలో కనీవినీ ఎరుగని సభ నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ కు అధికారం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశారని విమర్శించారు.

 

తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారనో, పదవుల కోసమే తాను పార్టీ మారడంలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వెల్లడించారు. తనకు పదవులు ముఖ్యం కాదన్న ఆయన… పదవుల కంటే తనకు ఆత్మాభిమానమే ముఖ్యమని తెలిపారు. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని భావించినా…కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie