Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలి

Ponds should be checked regularly

0

అధికారులతో మంత్రి కేటీఆర్ టెలి కాన్ఫరెన్స్
పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు శనివారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తీసుకోవాల్సిన కార్యక్రమాల పైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరా, వాటర్ బార్న్ డిసీజెస్ రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాల పైన ప్రధానంగా ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో చర్చించారు . ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకొని మరింత నిబద్ధతతో ముందుకు పోదామని అధికారులకు పిలుపునిచ్చారు.

ఇందుకోసం అవసరమైన అన్ని రకాల సహాయక సహకారాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖల తోనూ మన్వయం చేసుకొని ముందుకు పోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించాలి. పట్టణాల్లో ఉన్న చెరువులు పూర్తిగా నిండాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి, అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు వాటిని కొంత ఖాళీ చేయించండి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించండని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie