చేరికలపై దృష్టి సారిస్తున్న ప్రధాన పార్టీలు
ఇదే అదనుగా అధిష్టానాలతో నేతల లాబీయింగ్
ఎమ్మెల్యే టిక్కెట్, నామినేటెడ్ పోస్టు, కాంట్రాక్టుల హామీ
ఆర్థిక బలం ఉన్న లీడర్లపై పార్టీల దృష్టి
సీనియర్ల ముఖ్య అనుచరులు, బలమైన నేతలతో అధినేతల చర్చలు
కాంగ్రెస్ లో చిచ్చు రేపుతున్న చేరికలు
అసంతృప్తిలో సీనియర్‌నేతలు
రసవత్తరంగా తెలంగాణ రాజకీయాలు
రాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతీసారి అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదలయ్యే లాబీయింగ్.. ఇప్పుడు కాస్త తొందరగానే షురూ అయింది. పార్టీలో చేరితే తమకేం లాభమని అగ్ర నేతల ఎదుట బేరసారాలకు దిగుతున్నారు. ముందు ఎమ్మెల్యే టిక్కెట్.. లేదంటే నామినేటెడ్ పోస్టు.. అదీ కుదరకపోతే ఎన్నికల్లో గెలిస్తే కాంట్రాక్టు హామీలు పొందుతున్నారు. రాష్ట్రంలో చేరికల పర్వానికి తెరలేపిన ప్రధాన పార్టీలకు కొత్తగా చేరుతున్న నేతలు ఊహించని షాక్ ఇస్తున్నారు. దీంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న ఆయా పార్టీల అధిష్టానాలు.. పార్టీలో చేరే నేతలకు అనాలోచిత హామీలివ్వడం హాట్ టాపిక్ గా మారింది.