అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయి
నల్గొండ జిల్లాలో రాజకీయ వరదలు వస్తాయి. అన్ని నియోజకవర్గాల్లో కొత్త పాత వరదలు కలుస్తాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం అయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.
పార్టీ అధ్యక్షులనే మార్చినామనే ప్రచారం ఉన్నప్పుడు- ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం పెద్ద కష్టమా? గెలువలేని పార్టీల్లో రాజకీయ గొడవలు ఉన్నపుడు- అధికార పార్టీ, దండిగా అభ్యర్థులు ఉన్న పార్టీలో గొడవలు ఉండవా అని అయన ప్రశ్నించారు.