ఒరిస్సా నుంచి తమిళనా డుకు గుట్టుగా రవాణా అవుతున్న గంజాయి రవాణాను పోలీసులు స్వాదీ నం చేసుకున్నారు.1000 కేజీల గంజా యిని అక్రమంగా తమిళనాడుకు రవాణా చేస్తున్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుర్తించి రవాణా చేస్తున్న మోహన్ సూర్యం, ప్రసాద్, లోవరాజు, వంతల రాజబాబు తో పాటు డ్రైవర్ చింతపల్లి సూరిబా బును అరెస్ట్ చేసినట్లు సీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు.వాహనంతో పాటు 3 సెల్ ఫోన్లు,3,600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.మరోవైపు ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు … అనిల్ కుమార్ అనే ఘరానా దొంగని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.45 కేసుల్లో నిందుతుడు ఉన్నట్టు గుర్తించామని,15 తులాల బంగారం , 1/4 కేజీ ల వెండి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.