సనత్ నగర్ బాలుడి హత్య ఘటనలో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇమ్రాన్‌తో పాటు మరొకరిని అరెస్టు చేశారు. రెండు కోణాల్లో కేసును విచారిస్తున్న పోలీసులు. ఆర్థిక లావాదేవీలు, క్షుద్రపూజల నేపథ్యంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. హిజ్రా ఇమ్రాన్ ఇంటివద్ద క్షద్ర పూజల ఆనవాళ్లు కనిపించాయంటున్న స్థానికులు.
బాలుడు అబ్దుల్ వహీద్‌ను చంపి సమీప నాలాలో పడేసిన నిందితులు. బాలుడి తండ్రి వసీంఖాన్కు, ఇమ్రాన్‌కు మధ్య ఆర్థిక లాదేవీలు ఉన్నాయి. ఇద్దరి మధ్య నిన్న గొడవ జరిగింది. వసీంఖాన్పై కక్షతో బాలుడిని చంపేశాడని పోలీసుల అనుమానం. ఇమ్రాన్ ఇంటిని ధ్వంసం చేసిన స్థానికులు.