Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

జంట హత్యల కాలయముడు దొరికాడు.. బాపురంలో  తల్లి, కూతుర్ల హత్యలు చేసిన ముద్దాయి అరెస్ట్..

0

బాపురం గ్రామానికి చెందిన బోయ తలారి హనుమంతమ్మ, ఆమె కూతురు మహాదేవి ల హత్యకేసులో నిందితుడిని పోలీసుల అరెస్టు చేసారు. మృతురాలు మహాదేశికి నిందితుడు బోయ రమేష్ తో గత నెల రోజుల క్రిందట హచ్చోలి మఠము లో పెద్దలు వివాహం జరిపించారు. అయితే పెళ్లి అయ్యాక టెక్కలి కోట లో ఉండాలని రమేష్ మరియు మహాదేవి గ్రామ వాలంటీర్ అయినందున బాపురం లోనే కాపురం ఉండాలనే విషయం లో ఈ నెల 9 వ తేదీ రాత్రి గొడవ

 

పడగా బంధువులు సర్ది చెప్పి వెళ్లగా అదే రోజు రాత్రి ఈ విషయం లో గొడవ పడి రమేష్ తన భార్య మహాదేవి ని మరియు అత్త హనుమంతమ్మ ని బలమైన పట్టుడు కట్టేతో ఇరువురిని తలల మీద కొట్టి చంపాడు.  ముద్దాయి రమేష్ మీద హనుమంతమ్మ  అన్న అయ్యప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.  కేసులో దర్యాప్తులో  భాగంగా కోసిగి సర్కిల్ సిఐ. ఎరిసావలి, కౌతాలం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి  ఆధ్వర్యం లో టీమ్ ని ఏర్పాటు చేసారు. నిందితుడు  రమేష్ అరెస్టు చేసారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie