ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇస్తున్న సెంటు ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలుంటూ తెలుగుదేశంపార్టీ నాయకులు చంద్రబాబునాయుడు,కింజారపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెబుతారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు.రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలకోసం ఇస్తున్న సెంటు ఇళ్ల స్థలాలపై చంద్రబాబునాయుడు,అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పిఠాపురంలో ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఇది ట్రైలర్ మాత్రమే…అసలైనది తర్వాత ఉంది.
పిఠాపురం మహారాజా కోట ఆవరణలోగల వైసీపీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు,కార్యకర్తలతో కలిసి.ఎమ్మెల్యే దొరబాబు భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో బయలుదేరారు.ఈ ర్యాలీ కోటగుమ్మం సెంటర్ మీదుగా పిఠాపురం పట్టణమంతా తిరుగుతూ,గొల్లప్రోలు నగర పంచాయతీ మీదుగా చేబ్రోలు గ్రామం వరకు కొనసాగింది.ర్యాలీలో దారి పొడవునా నారా చంద్రబాబునాయుడికి,అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు మీడియాతో మాట్లాడుతూ.,14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడు పేద ప్రజలకు ఒక్క గజం ఇళ్ల స్థలం కూడా మంజూరు చేయలేదని,నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేస్తుంటే చూసి ఓర్వలేక సెంటు స్థలాలను స్మశాన వాటికలగా పోల్చడం దారుణమని అన్నారు.