వినతిపత్రాలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఒక్కోసారి నేతల విగ్రహాలకు ఇవ్వడం చూసాం. కానీ కరీంనగర్ లో గ్రామపంచాయతీ కార్మికులు వినూత్నంగా పాముకు వినతిపత్రం ఇచ్చిన వైనం ఇది. మల్యాల మండలంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు గత పక్షం రోజులుగా తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్నారు.
తమ గోడును ఎవరు పట్టించుకోవడం లేదని పాముకు వినతిపత్రం అందించి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మల్యాల మండల కేంద్రంలోని ఎంపీపీ కార్యాలయం ముందు కొన్ని రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. పంచాయతీ కార్మికులు పాముకు వినతి పత్రం ఇవ్వడం చర్చనీయాంశమైంది.