Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

OGకి సాహోతో సంబంధమా?

OG VS SALAAR Which Is Best India Movie

0

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఒజీ చిత్రం తెరకెక్కు తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సిద్ధమవుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసి మెజారిటీ సీక్వెన్స్ ని సుజిత్ కంప్లీట్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ 30 రోజులు కాల్ షీట్స్ కేటాయిస్తే అతనికి సంబందించిన సన్ని లన్నీ కంప్లీట్ కానున్నాయని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీమెయిన్ విలన్ గా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి. అర్జున్ దాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. వారు ఇప్పటికే షూటింగ్ లో పాల్గొన్నారు. ప్రియాంకా ఆరుళ్ మోహన్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంటరె స్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుజిత్ ఒజీ కంటే ముందుగా సాహో సినిమా ప్రభాస్ తో చేశారు.

ఈ చిత్రంలో వాజీ అనే సిటీ ఉంటుంది. ఆ సిటీ బ్యాక్ డ్రాప్ లోనే కథ ఉంటుంది. మాఫియా హెడ్ క్వార్టర్ గావాజీ సిటీని రిప్రజెంట్ చేశారు. తాజాగా ఒజీ మూవీకి సంబందించిన కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. వాటిలో.. వాజీ ఇంపోర్ట్ అండ్ ఎక్స్ పోర్ట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుని ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో ఒజీ సినిమాని సాహోకి కనెక్ట్ చేస్తున్నట్లు ఉన్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. నెటిజన్లు దీనిపై భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. అసలు సాహో సినిమాతో ఒజీని ఎలా కనెక్ట్ చేస్తారంటూ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే సాహోతో స్టొరీని కలిపి మొత్తానికి సుజిక్ చెడగొట్టేలా ఉన్నాడంటూ మరొకరు కామెంట్స్ చేశారు. అయితే ఈ పేరు యాదృశ్చికంగా పెట్టినదే అయ్యుంటుంది తప్ప సాహో కథకి ఒజీతో ఎలాంటి సంబంధం ఉండే ఛాన్స్ లేదనే మాట కూడా వినిపిస్తోంది. చూద్దాం… చివరికి సుజిత్ ఒజీని ఏం చేస్తారో..

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie