హైదరాబాద్, జనవరి 31: తెలంగాణలో ఇంటర్ పేపర్ల ఆన్‌లైన్ వాల్యుయేషన్‌పై రగడ కొనసాగుతోందిఇంటర్ ఆన్లైన్ వాల్యుయేషన్పై సర్కార్ అత్యుత్సాహం చూపుతోంది. ఇంటర్ ఎడ్యుకేషన్లో ఎవరికీ పెద్దగా అవగాహన లేకున్నా, ఒకేసారి రాష్ట్రంలోని సగం మంది స్టూడెంట్లకు అమ లు చేసేందుకు రెడీ అయింది. దీనికి అనుగుణంగా టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది కేవ లం రెండు, మూడు మైనర్ సబ్జెక్టులతో పాటు లాంగ్వేజీల్లో అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదట ప్రకటించగా.. ఇప్పుడేమో లాంగ్వేజీలతో పాటు ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంట్లు అందరికీ అమలు చేయాలని నిర్ణయించారు. పోయినేడాదే బోర్డు అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ, అప్పటి సీఎస్సోమేశ్ కుమార్ పక్కనపెట్టారు.
ఇంటర్ బోర్డు ఇన్చార్జ్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఈ ఏడాది మరోసారి ప్రతిపాదనలు పంపారు. నవంబర్లో జరిగిన ఇంటర్ బోర్డు సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. పైలట్ ప్రాజెక్టు కింద రెండు, మూడు సబ్జెక్టుల్లో ప్రారంభించాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని మంత్రి సబితారెడ్డి మీడియాతో చెప్పారు. కానీ లాంగ్వేజీలతో పాటు ఆర్ట్స్ గ్రూప్ స్టూడెంట్లు అందరికీ అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. దీనికి అనుగుణంగా బుధవా రం టెండర్లు కూడా పిలిచారు. 2022–23, 2023–24, 2024–25 అకడమిక్ ఇయర్లల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ తో పాటు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆన్లైన్ వాల్యువేషన్కు టెండర్లను ఖరారు చేయనున్నారు.
గురువారం నుంచి టెండర్లు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఇంటర్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంపై కొందరు తప్పుపడుతున్నారు. ఇంటర్ స్టూడెంట్లకు ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. రాష్ట్రంలో 9.5 లక్షల మంది ఇంట ర్ స్టూడెంట్లు ఉంటే, వారిలో 5 లక్షల మందికిపైగా సైన్స్ స్టూడెంట్లు. సైన్స్ స్టూడెంట్లకు ప్రధాన సబ్జెక్టులు మినహా మిగిలిన లాంగ్వేజీ సబ్జెక్టులకు ఆన్ లైన్ వాల్యుయేషన్ చేయాల్సి ఉంది. దీంతో లెక్చరర్లలో అయోమయం నెలకొంది.
ఆన్లైన్ వాల్యుయేషన్పై వారికి ట్రైనింగ్ ఇవ్వలేదు. దీంతో సాధ్యమవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.లెక్చరర్లకు సరైన శిక్షణ ఇవ్వకుండా, ఆన్‌స్ర్కీన్ వాల్యుయేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను చేయకుండానే ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం మంచిది కాదని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈనేపథ్యంలో ఇంటర్మీడియట్ జవాబు పత్రాల డిజిటల్ వాల్యుయేషన్‌పై వస్తోన్న ఫిర్యాదులు, విమర్శలపై ఇంటర్ బోర్డు సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఒక కీలక ప్రకటన విడుదలచేశారు. ‘ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు అనేక క్రిమినల్ కేసులుతో సస్పెండైన ఒక జూనియర్ లెక్చరర్ బోర్డు అధికారులపై అనేక ఆరోపణలు చేశారు.
సంబంధం, అర్హత లేని వ్యక్తి బోర్డు వాల్యుయేషన్ సిస్టంపై అనుమానాలు, అపోహలు క్రియేట్ చేశారు. ఆన్‌లైన్ వాల్యుయేషన్‌లో పారదర్శకత ఉంటుంది. ఇంట్లో నుండి కూడా వాల్యుయేషన్ చేయవచ్చు. దీని వల్ల ఖర్చు, పనిభారం పూర్తిగా తగ్గిపోతుంది. ఆన్‌లైన్‌లో చాలా కచ్చితత్వంతో వాల్యుయేషన్ చేయవచ్చు.నూతన విధానం వల్ల రీకౌంటింగ్, రీ వాల్యుయేషన్ కూడా సులభంగా చేయవచ్చు. విద్యార్ధుల సౌలభ్యం కోసమే ఇంటర్ లో ఆన్‌లైన్ వాల్యుయేషన్ ప్రవేశపెడుతున్నాం’‘మంచి పని చేస్తుంటే సస్పెండైన వ్యక్తి ఎందుకు బాధపడుతున్నారో అర్థం కావడం లేదు. ఎగ్జామినేషన్ ప్రాసెస్ కంట్రోల్ చేస్తున్న కొంతమంది తమ చేతుల నుండి వ్యవస్థ పోతుందనే బోర్డుపై ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు.
ఈసారి ప్రయోగాత్మకంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజెస్ పేపర్స్ మాత్రమే ఆన్‌లైన్ వాల్యుయేషన్ చేస్తున్నాం. గతంలో తప్పుడు ట్రాక్ రికార్డ్ ఉన్న సంస్థలను ఆన్‌లైన్ బిడ్డింగ్ కి అనుమతించడం లేదు. ఓయూ, అంబేడ్కర్ యూనివర్సిటీల్లో ఆన్‌లైన్ వాల్యుయేషన్ పద్ధతే కొనసాగుతోంది. కొంతమంది ఇంటర్ బోర్డును ఆదాయవనరుగా మార్చుకున్నారు. అలాంటి వారి ఆటలు సాగవని బోర్డుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పేపర్ వాల్యుయేషన్ పై ఎలాంటి గందరగోళం లేదు. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని ప్రకటనలో పేర్కొన్నారు నవీన్ మిట్టల్.