బూరుగుపల్లి ప్రమాద ఘటన
పొట్ట చేత పట్టుకుని రోడ్డు పనులకు వచ్చిన వారొకరైతే, విధుల్లో భాగంగా లారీ క్లీనర్ గా పని చేస్తున్నవారు మరొకరు. తప్పు లేకున్నా మృత్యువాత పడ్డ హృదయ విదారక ఘటన నిర్మల్ జిల్లా బూరుగు పల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా నేరడి గొండ మండలంలోని చీన్న గ్రామానికి చెందిన లాల్ సింగ్, రాజేంద్ర ప్రసాద్ జాతీయ రహదారిపై మరమ్మతు పనుల నిమిత్తం కూలీలుగా వచ్చి పనులు చేస్తున్నారు. అదే సమయంలో తారు లోడ్ తో ఆగి ఉన్న టిప్పర్ ను వెనుకగా అనంతపూర్ నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో టిప్పర్ ముందు పని చేస్తున్న కూలీల పైనుంచి వెళ్లి బోల్తా పడింది. దీంతో రాజేంద్ర ప్రసాద్, లాల్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అలాగే ఢీ కొన్న లారీలో ప్రయాణిస్తున్న క్లీనర్ కాసిం కూడా మృతి చెందాడు.