శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి అక్రమ బంగారం రవాణా బయటపడింది. ఈ సారి అధికారులు కిలోన్నర బంగారం పట్టివేసారు. మస్కట్ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు నుండి 1476 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి సానిటరీ ప్యాడ్ లో అమర్చి తరలిస్తూ నిందితురాలు కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. రూ 77.90 లక్షలకు పైగా విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.