వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దిగ్విజయంగా నాలుగేళ్ల సుపరిపాలన పూర్తి చేసుకున్న శుభ తరుణంలో నంద్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో మంగళవారం గౌరవ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, గౌరవ నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా , మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి మున్సిపల్ చైర్మన్ మాబున్నీసా, ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, జగనన్న నాయకత్వానికి జేజేలు పలుకుతూ సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ… చరిత్ర ఎరుగని సంక్షేమ పాలనకు నాలుగేళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విజయ పథంలో దిగ్విజయంగా నడిపించారన్నారు. జగనన్న ప్రజా సంక్షేమ పాలన, సుపరిపాలనలో రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి సాధించిందని అన్నారు, మాట తప్పని మడమతిప్పని జననేత జగనన్న పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ప్రగతి పథంలో దూసుకుపోతున్నదని పేర్కొన్నారు, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ దిశగా అడుగులు వేస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు.
రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మల్లో, అవ్వతాతల్లో, విద్యార్థులలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయాన్ని చేస్తూ అందరూ మనవాళ్లే అన్న సిద్ధాంతాన్ని నమ్మి రాష్ట్రాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం అందరికీ ఆదర్శం అన్నారు, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక భరోసా, నమ్మకం, విశ్వాసం గుండె ధైర్యం అని, వారి నాయకత్వంలో తామంతా మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమ అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో నవ చరితకు నాంది పలికిందన్నారు, మహానాడులో నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు తెర తీసిందన్నారు,
యూపీఎస్సీ సివిల్స్ లో ప్రతిభ సాధించిన శివ మారుతి రెడ్డి ని శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే.
చంద్రబాబు నాయుడు ఎన్ని మోసపు వాగ్దానాలు అబద్దాలు చెప్పినా ప్రజలు నమ్మరని అన్నారు,దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అకుంటిత దీక్షతో బడుగు, బలహీన వర్గాలకు పారదర్శకంగా డిబిటి విధానం ద్వారా సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదును బదిలీ చేస్తున్నారని తెలిపారు. మన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలనే కాక అనేక సంక్షేమ పథకాలను దాదాపుగా 98 శాతం పైగా పూర్తి చేశారన్నారు, గత టిడిపి పాలనలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో ఒక్కటి కూడా అమలు చేసిన దాఖలాలు లేవన్నారు, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో పవిత్రమైన బైబిల్, ఖురాన్, భగవద్గీత లతో సమానంగా భావించి తూచా తప్పకుండా హామీలను అన్నింటిని నెరవేర్చారన్నారు,
అయితే ఇటీవల జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గత వాగ్దానాలనే మరోసారి రిపీట్ చేశారని, గతంలో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎక్కడ ఇచ్చారో చెప్పాలన్నారు, ప్రజలు చంద్ర బాబు నాయుడు మాటలు నమ్మరని కుహన రాజకీయాలు, కుల్లు రాజకీయాలు, కపట ప్రేమలకు, మోసాలను ప్రజలు నమ్మరన్నారు. మహిళలకు స్కీమ్లంటూ ఊదరగొట్టారని, అమలు చేయక పోవడంతో వారికి బ్యాంకులలో రుణాలు పెరిగిపోయి తాకట్టు పెట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారన్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం అక్కా చెల్లెమ్మలకు బ్యాంకులలో ఉన్న రుణాలన్నింటిని మాఫీ చేశారని పేర్కొన్నారు. జనరంజక కాపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి తిరిగి మళ్లీ ప్రజలు పట్టం పట్టం కట్టడం తద్యం అన్నారు.
టిడిపిని ప్రజలు మరోసారి భూస్థాపితం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలు రావడానికి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కదన రంగంలో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. దేశంలో అందరికీ జగనన్న ఆదర్శప్రాయుడన్నారు. కరోనా సమయంలో ప్రజల కష్టాలను తీర్చి సచివాలయం, వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని గుర్తు చేశారు. రానున్న కాలంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, ఫామ్ షావలి, ఎంపీపీ శెట్టి ప్రభాకర్,వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి,డా. కల్లూరి రామలింగారెడ్డి, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సిద్ధం శివరాం, మాజీ మున్సిపల్ చైర్మన్ డా. కైపా రాముడు, వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.