తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలను మే 31వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఘనంగా నిర్వహించబోతున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మ సరోవరంలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమ పూజలు అందుకొని భక్తులను అనుగ్రహిస్తారని చెప్పారు.
ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు అమ్మవారికి తెప్పోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.పద్మ సరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని పేర్కొన్నారు. మే 31వ తేదీన రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి, రెండో రోజు సుందరరాజ స్వామి, చివరి మూడు రోజులు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై వహరిస్తారు.
ఈ క్రమంలోనే ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు కావడంతో శ్రీనివాసుడి దర్శనం కోసం భక్తులు ఏడు కొండలకు క్యూ కడుతున్నారు.
తిరుపతి గంగజాతర సందర్భంగా అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు.
సోమవారం రోజున 70,366 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 38,653 మంది తలనీలాలు సమర్పించగా, 4.32 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. ఇక సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి శిలాతోరణం వరకూ భక్తులు లైన్ లో వేచి ఉన్నారు. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది.ఇక క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు త్రాగునీరు, అన్నప్రసాదాలు, మజ్జికలను టీటీడీ నిరంతరాయంగా అందిస్తుంది.
భక్తులు సమన్వయం పాటించి శ్రీనివాసుడి దర్శనం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. ఇందులో భాగంగా మంగళవారం ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారముకు తెరిచిన అర్చకులు.. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. అనంతరం తోమాల, అర్చన సేవలు నిర్వహించిన అర్చకులు.. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీకొలువు శ్రీనివాసమూర్తిని వారి సమక్షంలో దర్భార్ నిర్వహించారు.
ఆన్ లైన్ లో చిట్స్.. కొత్త విధానం తెచ్చిన సర్కార్.
శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జనాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు. నవనీత హారతి సమర్పించి అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదనలో అన్నప్రసాదం, లడ్డూ, వడలు, చక్కెర పొంగలి, మిరియాలు పొంగలి, పగిలిన కుండలో వెన్నతో కలిపిన అన్నం(మాత్ర), దద్దోజనం స్వామి వారికి నైవేద్యంగా సమర్పించారు.