గత రెండు రోజులుగా అంత్యక్రియలకు డబ్బులు లేక విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లో ఉన్న ఒక అనాధ శవానికి అంత్యక్రియలు చేసి న్యూ విజయనగరం యూత్ ప్రెసిడెంట్ అంబులెన్స్ శివ,సెక్రెటరీ అనిల్ కుమార్.. మానవత్వాన్ని చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం కడప నుంచి మట్టి పని నిమిత్తం సాలూరు వచ్చిన గోపాల్ నాయుడు అనే వ్యక్తి ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మరణించడం జరిగింది.. చనిపోయిన వ్యక్తి భార్య డబ్బులు లేక బాధ పడుతుండటం చూసిన న్యూ విజయనగరం యూత్ సభ్యులు మృతదేహానికి అంతిక్రియలు మేము చేస్తాం
అని ముందుకు వచ్చి ఈరోజు రింగ్ రోడ్డు లో ఉన్న వైకుంఠ ద్వారం లో తమ సొంత డబ్బుకు ఖర్చు చేసి మృతదేహానికి అంతిక్రియలు జరిపారు.. న్యూ విజయనగరం యూత్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ శివ సెక్రటరీ అనిల్ మాట్లాడుతూ మృతుడి భార్య యొక్క ఆవేదన చూడలేక మేము ఈ కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చామని, ఇలా ఎవరు లేని అనాధ మృతదేహాలకు మేము అంత్యక్రియలు చేస్తూ ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యూ విజయనగరం యూత్ ఫౌండేషన్ సభ్యులు అరవింద్ సందీప్ , సాయి కృష్ణ ,తరుణ్, సాయి, తదితరులు పాల్గొన్నారు,
2024లో జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి ఖాయం.