నేడు శ్రీశైలం నియోజకవర్గంలో నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. నేటితో యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోనుంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో తల్లి భువనేశ్వరి సహా నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బోయరేవుల నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ముత్తుకూరు, పెద్ద దేవళాపురం, సంతజూటూరు, పరమటూరు మీదుగా బండి ఆత్మకూరు వరకు పాదయాత్ర సాగనుంది.
కరాటే కళ్యాణి వర్సెస్ బీఆర్ఎస్.
సంత జూటూరులో చెంచులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించనున్నారు. యువగళం పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీగా కార్యకర్తలు, అభిమానులతో ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో యువగళం పాదయాత్ర మార్గం హోరెత్తుతోంది. పెద్దఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. దాంతో 3 కి.మీ. మేర ట్రాఫిక్ స్థంభించింది. బాణాసంచా మోతలు, డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరుతో జాతరను యువగళం తలపిస్తుస్తోంది.