గంగాధర నెల్లూరు
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 14 వ రోజు యువగళం పాదయాత్ర గురువారం ప్రారంభం అయింది. ఆత్మకూరు ముత్యాలమ్మ గుడి లో పూజలు జరిపి అయన యాత్ర ప్రారంభించారు. ఉదయం అయనను ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాల ప్రతినిధులు కలిసారు. గత టిడిపి హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థల అనుమతుల పునరుద్దరణ 10 ఏళ్లకు ఒక సారి జరిగేది. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత 3 ఏళ్లకు ఒకసారి అనుమతులు రెన్యువల్ చేసుకోవాలని నిబంధన పెట్టారని వారన్నారు. తో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగాల్సి వస్తుంది. పాత పద్ధతినే కొనసాగించేలా చర్యలు తీసుకోండి. ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతులు కోసం వేధింపులకు గురిచేస్తున్నారు.
ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యుత్ బిల్లుల స్లాబ్ ను 2 నుండి 7కి మార్చాలని వారు కోరారు.లోకేష్ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి విద్యావ్యవస్థను సర్వనాశనం చేసింది. జె-ట్యాక్స్ కోసం ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు వేధింపులకు గురిచేస్తోంది. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పదేళ్లకోసారి రెన్యువల్ విధానాన్ని పునరుద్దరిస్తాం. ఫైర్ ఎన్ ఓసి, ఇతర సాకులతో జరుగుతున్న వేధింపులు లేకుండా చేస్తాం. విద్యుత్ బిల్లుల అంశాన్ని పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.