విలేఖరి పై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ, చాల దారుణం దాడి చేయడం హేయమైన చర్య అని నంద్యాల జిల్లా డి టి ఎఫ్ ఉపాధ్యక్షులు గాదె రోషన్న ఓ ప్రకటనలో తెలిపారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం లో కలర్స్ పార్టీ నాయకులు మీడియా పైన, విలేఖరులపైన దాడి చేయడం సర్వసాధారణమైందన్నారు .భారత రాజ్యాంగంలో పత్రికలకు మీడియాకు చాల సముచితమైన స్థానం ఉందని ఈ విధంగా దాడి చేయడం రాజ్యాంగ విరుద్ధం రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఈ విధంగా దాడిచేసి వారి యొక్క కెమెరాలు, వీడియోలు ద్వంసం చేయడం అనాగరికమైన చర్య అన్నారు.
సంఘంలోను సాంఘిక దురన్యాయాలను ఖడిస్తూ, ప్రభుత్వ విధానాలను క్రమపద్ధతిలో నడిపించేందుకు వార్తా పత్రికకు సాటి మరో సాధనం లేదు అని పేర్కొన్నారు. అలాంటి పత్రికలపైన, జర్నలిస్టులపైన దాడులు. చేయడం, హత్యలు చేయడం లాంటివి చేయడం అత్యంత ఖండనీయం. అవినాష్ రెడ్డి వర్గీయులపైన దాడికి కారణమైన మూలమైన ఎంపీ అవినాష్ రెడ్డిని పదవి నుంచి బహిష్కరిం చాలి- ప్రజాస్వామ్యానికి నాలుగవ స్థంభమైన మీడియాపైన్ జర్నలిస్టుల పై దాడి చేయడం అంత్యంత హేయమైనా చర్యలకు వైకాపా నాయకులు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి స్పందించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులకు బేషరుతుగా క్షమామణ చెప్పాలని డిటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.