చార్మినార్ జోన్ ఎస్సైగా ఎంపికైన నల్లమల్లబిడ్డ మాదాని సంధ్య
Nallamallabida Madani Sandhya selected as Charminar Zone SI
కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నల్లమల్ల బిడ్డ నిరూపించింది. నిరుపేద కుటుంబంలో జన్మించి అకుంఠిత దీక్షతో తర్ఫీదు పొంది లక్ష్యాన్ని సాధించింది.నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మాధవానిపల్లె గ్రామ వాసిని మాదాని సంధ్య ఇటీవలే విడుదలైన ఎస్సై పోస్టులో ఆమె ఎంపిక అయ్యారు.
గ్రామంలో చిన్నపాటి వ్యవసాయంతో పాటు హైదరాబాద్ లో కారు డ్రైవర్ గా పని చేసుకుని జీవించే మాదాని మల్లయ్య పుష్పమ్మ దంపతుల కుమార్తె అయిన మాదాని సంధ్య చార్మినార్ జోన్ లో ఎస్సైగా ఎంపికయింది. తండ్రి మల్లయ్య హైదరాబాదులో కార్ డ్రైవర్ గా పని చేస్తూ బిడ్డను బీఎస్సీ కంప్యూటర్స్ సైన్స్ చదివించాడు. కూతురును ఎలాగైనా ఎస్సై చేయాలని తలంచి కోచింగ్ ఇప్పించాడు. ఎస్సై పరీక్ష రారాసి చార్మినార్ జోన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగం సాధించింది.
కష్టంతో కాదు ఇష్టంతో చదివితే ఏ ఉద్యోగమైన సాధించవచ్చని, తన తల్లిదండ్రులు ప్రోత్సహించారని ఆమె తెలిపారు. నిరుపేద విద్యార్థులను ఆదుకోవడం తోపాటు, సమాజ ప్రగతి కోసం కృషి చేస్తానని ఆమె అన్నారు. పేద కుటుంబంలో జన్మించిన సంధ్య ఎస్సై పోస్టుకి ఎంపిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు మల్లయ్య, పుష్ప అన్నారు. మాధవానిపల్లి గ్రామస్తులు కూడా ఇప్పటివరకు గ్రామంలో 35 మంది పోలీసులు ఉన్నారు కానీ ఎస్సైగా సంధ్య తొలిసారి ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.