రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలోని పలు ఆలయాలు నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడయి.ప్రతియేటా శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజున పెద్దఎత్తున మహిళలు తెల్లవారు జామున నుండే భక్తిశ్రద్ధలతో నాగదేవతకు పాలు పూలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
గ్రామంలోని గండి వెంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం, బుగ్గ రాజేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు పుట్టలో పాలు పోసి తాము కోరిన కోర్కెలు తీరాలని,ప్రజలంతా సుఖ సంతోషాలతో చల్లంగ చూడాలని వేడుకున్నారు.