Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

నగర పౌరులకు అందుబాటులో సుపరిపాలన మంత్రి కేటీఆర్.

0

కాచిగూడలో జిహెచ్ఎంసి వార్డ్ కార్యాలయ వ్యవస్థను  పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావుశుక్రవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ  ఒకే రోజు నగరవ్యాప్తంగా 150 డివిజన్ లలో వార్డ్ కార్యాలయాలను ప్రారంభించుకుంటున్నాం.  వార్డు కార్యాలయం ద్వారా నగర ప్రజలకు మరింత వేగంగా పౌర సేవలు అందుతాయి. పౌర సేవలతో పాటు ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిహెచ్ఎంసి అధికార యంత్రాంగానికి వీలు కలుగుతుందని అన్నారు.

 

వార్డు స్థాయిలో కార్పొరేటర్లు ఉన్నారు కానీ అధికార యంత్రాంగం ప్రత్యేకంగా లేకపోవడం వలన ఈ వార్డు కార్యాలయ వ్యవస్థను తీసుకువచ్చాం.  నగర పౌరులకు సుపరిపాలన అందించాలన్న సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. రాజకీయాలకు అతీతంగా ఈ వ్యవస్థ విజయవంతానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

 

బీజేపీలో డైలమాకు హైకమాండ్ తెర.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie