Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

minor girl Gang rape in Telangana

0
  • తీవ్ర రక్తస్రావంతో బాలిక మృతి
  • పెద్దపల్లి జిల్లా అప్పన్నపేట గ్రామ శివారు శివపార్వతి నగర్ లో ఘటన

పొట్టకూటి కోసం పరాయి రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వలస వచ్చిన ఓ మైనర్ బాలికను నలుగురు వ్యక్తులు అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావమై బాలిక మృతి చెందిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివ పార్వతి నగర్ లో ఈ అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం బాలగట్ జిల్లాలోని కజరి గ్రామానికి చెందిన నమిత అనే 16 సంవత్సరాల దినసరి కూలి గత రెండు సంవత్సరాలుగా తన అక్క బావలతో కలిసి పెద్దపల్లి పట్టణ శివారు లోని శివ పార్వతి నగర్ లో ఓ కాంట్రాక్టర్ వద్ద భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తుంది.

minor girl Gang rape in Telangana

ఈనెల 14వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ప్రాంతంలో బాలిక పనిచేసే ఇంటి కాంట్రాక్టర్ వద్ద పనిచేసే ఓ యువకుడు కూలి డబ్బులు చెల్లిస్తానని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తనను పని ప్రదేశం వద్ద వదిలేసి వెళ్లినట్లు మైనర్ బాలిక వాయిస్ రికార్డులో తెలిపింది.

Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్నగాండీవ‌ధారి అర్జున

మైనర్ బాలికను పెద్దపల్లి ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న నలుగురు యువకులు అత్యాచారం చేసినట్లు సహచర కూలీలకు బాధితురాలు తెలుపుతుండగా తోటి కూలీలు వాయిస్ రికార్డు చేశారు. ఊహించని సంఘటనకు భయభ్రాంతులకు గురైన బాదితురాలి కుటుంబం పెద్దపల్లిని విడిచి బొలెరో వాహనంలో మధ్యప్రదేశ్ కు వెళుతున్న క్రమంలోని మార్గమధ్యంలో అత్యాచారానికి గురైన బాలిక చనిపోయినట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మైనర్ బాలిక తో పని చేసే తోటి కూలీలు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ గ్యాంగ్ రేప్ కు పాల్పడిన నలుగురు వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie
Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie