గంగమ్మ తల్లి కి అభిషేకం నిర్వహించిన అనంతరం పెద్ద సంఖ్యలో
దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు
తొక్కిసలాట జరగకుండా
అమ్మ వారి భక్తులకు దర్శన ఏర్పాట్లు
కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో పొంగళ్ళు పెట్టుకునేలా మెరుగైన సౌకర్యాలు
భక్తుల సహకారం వల్లే గంగ జాతర ఇంత ఘనంగా నిర్వహిస్తున్నాము
స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా మంగళవారం వేకువజామున నుంచే భక్తులు విచ్చేసి గంగమ్మ తల్లిని మనసారా దర్శించుకుంటున్నారని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జాతర చివరిరోజు కావడం తో పెద్దా ఎత్తున ఆలయం లోను,మార్కెట్ యార్డ్ నందు పొంగల్ పెట్టు కొని గంగమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంయున్నారని తెలిపారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో మటన్ బిర్యానీ, మాంసాహార భోజనాలను ఏర్పాటు చేసి,ప్రజలకు అమ్మవారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే స్వయంగా వడ్డించి, మంచి నీళ్ల బాటిల్స్ అందజేస్తున్నారు.అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.పొంగల్లు,కోళ్లు, పొటెంట్లు అమ్మవారికి మొక్కుబల్లు చెల్లించే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం కూడా జరుగుతుందన్నారు.క్యూ లైన్లు నందు తోపులాటలు జరగకుండా,గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
మహిళల ఆర్థిక అభివృద్ధికి లయన్స్ విజన్ కృషి.
బుధవారం తెల్లవారి జామున 1.30 గంటలకు నిర్వహించే అమ్మ వారి విశ్వరూప దర్శనం ఘట్టానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అనంతరం జాతర లో వీధుల యందు తిరుగుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులకు చుచనాలు ఇస్తూ,భక్తులను చిరునవ్వు తో పలకరిస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బుర్రలు ఊదుతూ జాతరలో ఆనందంతో తిరిగారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ డాక్టర్ శిరీష,నగర పాలక సంస్థ కమిషనర్ హరిత, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కట్టా గోపి యాదవ్,ఈఓ మునికృష్టయ్య,తదితరులు పాల్గొన్నారు.