- వరద నష్టాలను తీర్చడానికి 500 కోట్లు
- నీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకూడదు
- అంటువ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు
- రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, కాలువలు, చెరువులు,కెనాల్, పంట నష్టాలపై పక్కాగా అంచనాలను సిద్దం చేయాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుదవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో భారీ వర్షాలు, వరద నష్టంపై ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు,జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన వాటికీ మరమ్మాత్తులకు 500 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. రాష్ట్రంలో గతంలో కురిసిన వర్షాల కంటే ఈసారీ కురిసిన వర్షాపాతం తక్కువగా ఉన్నప్పటికి ఒకే ప్రాంతంలో కుండపోతగా భారీ నండి అతిభారీ వర్షాలు కురిసాయన్నారు.
గురువారం నుండి మరో రెండురోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయ పరుచుకొని జిల్లాలోని ప్రతినియోజక వర్గం వారిగా ఇరిగేషన్, ఆర్అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లకు ఎర్పడిన నష్టాలకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని, నష్టంపై అంచనాలను సిద్దం చేసి అసెంబ్లి సమావేశాలలోగా ప్రభుత్వానికి నివేదికను పంపించాలని సూచించారు. వరదలతో వ్యవసాయం చేయడానికి వీలు లేకుండా పంటపోలాల్లోకి ఇసుక వచ్చి చేరడంతో తీవ్రంగా పంట పొలాలకు నష్టం వాటిల్లిందని, పంటపోలాను తీరిగి వ్యవసాయానికి అనుకులంగా మార్చేలా పంటపోలాల్లోకి చేరిన ఇసుకను ఉపాదికూలీల ద్వారా తొలగించేలా ప్రభుత్వానికి అనుమతికి ప్రతిపాదనలు పంపించాలి డిఆర్డిఓ ను ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా 3945 ఎకరాల్లో వరి , 788 ఎకరాల్లో పత్తి , 31 ఎకరాలోమొక్కజొన్న , 6 ఎకరాల్లో కూరగాయల తోటలు నష్టపోయాయన్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాదులు, అంటువ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా వ్యవహంచి అవసరమైన మందులతో సిద్దంగా ఉండాలని సూచించారు. వర్షాలు, వరదలతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే సహాయక చర్యలను ప్రారంబించి ప్రజలకు బరోసాను కలిగించాలని అన్నారు. ఇప్పటి వరకు మానేరు ప్రమాదస్థాయికి చేరుకోలేదని, మోయతుమ్మేద వాగు నుండి మానేరులోకి వస్తున్న లక్ష టీయంసీ వరదను దిగువకు విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. దెబ్బతిన్న ఇన్టెక్ వాల్స్, కల్వర్టులు, మత్తడులను పునరద్దరించడానికి కావాలసిన నిధుల కొరకు అంచనాలు సిద్దం చేయాలని, పునరుద్దరణ పనులన వేగవంతం చేయాలని, వర్షాలు ఇంకా పడే అవకాశం ఉండడంతో పాడయిన రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని అన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు అనుమతించిన ఇరిగేషన్, రోడ్లు మరియు ఇతర పనులపై సంబంధిత అధికారులు, గుత్తేదారులతో క్షేత్రస్థాయిలో సమీక్షించాలని, పనుల్లొ అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపార. జిల్లాలో ఎక్కడా మంచినీరు, విద్యూత్ సరఫరాల్లో అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు. భారీ వర్షాలు కురిసిన జిల్లాలో ఎక్కడ విద్యూత్ కు అంతరాయం కలుగకుండా చూసిన విద్యూత్ శాఖ అధికారులకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, వొడితల సతీష్ బాబు, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, రాష్ట్ర పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, కలెక్టర్ బి గోపి యాదవ్,సిపి సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లోకల్ బాడీస్, నగర మేయర్ వై సునీల్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీ కిరణ్, కరీంనగర్ ఆర్డిఓ కే. మహేష్, మున్సిపల్ చైర్మన్లు, జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.