అంతర్రాష్ట్ర చెక్ పోస్టును తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ – కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధ్వర్యంలో ఉన్న కృష్ణ చెక్ పోస్ట్ ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆకస్మిక తనిఖీ చేసారుప్రొహిబిషన్ & ఎక్సైజ్, రవాణా శాఖ అధికారులతో కలిసి అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్ట్ ల వద్ద మరింత భద్రత, తగినంత సిబ్బందిని నియమించాలనీ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు.
. మంత్రి మాట్లాడుతూ అంతరాష్ట్ర సరిహద్ధు లోని ప్రోహిబిషన్ & ఎక్సైజ్ అధ్వర్యంలో ఉన్న చెక్ పోస్ట్ లను మరింత పటిష్టం చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై ఉక్కు పాదం మోపాలి. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతున్న మద్యం సురక్షితం కాదు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా సరఫరా చేస్తున్న దళారుల వలలో పడొద్దనిఅన్నారు. ఈ తనిఖీ లో ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పాటు ఉన్న సిబ్బంది నిర్లక్యంగా వ్యవహరించడాన్ని గమనించిన మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ స్ధానిక సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనంతరం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ తో మంత్రి సెల్ ఫోన్ లో మాట్లాడి చెక్ పోస్ట్ లో తగినంత సిబ్బంది ని నియమించాలని ఆదేశించారు.
చేతివృత్తుల రుణాలను స్వర్ణకారులు సద్వినియోగం చేసుకోవాలి.
అనంతరం, రాయచూరు నుంచి మక్తల్ వైపు వస్తున్న పలు వాహనాలను మంత్రి స్వయంగా తనిఖీ చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపాలని, తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలాంటి పొరపాటు మరోసారి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులను రాష్ట్ర మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.