మండిపడుతున్న నూజివీడు జనసైనికులు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి కృష్ణాజిల్లాల జనసేన అధికార ప్రతినిధి మరీదు. శివరామకృష్ణ మాట్లాడుతూ పేదల స్థలాలు,జగనన్న కాలనీ ఇళ్ళు పంపిణిలో అవినీతి,అక్రమాలను గుర్తించలేని గృహా నిర్మాణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని జోగి రమేష్ కు వార్నింగ్ ఇచ్చిన జనసైన్యం.
జనసేన పార్టీ పిలుపు మేరకు శనివారం నుండి వైసీపీ ప్రభుత్వo పేదలకు కేటాయించిన ఇళ్ళ నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలను బట్టబయలు చేసే కార్యక్రమం చేపట్టనున్నట్టుగా తెలిపిన జనసేన నాయకులు. మంత్రి జోగి రమేష్ మరోసారి ఇష్టారాజ్యంగా మాట్లాడితే రాష్ట్రంలో జనసేన నాయకులు అందరూ మంత్రి జోగి రమేష్ ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.