ముద్ర ప్రతినిధి, జనగామ: ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన పాలకుర్తి సోమేశ్వరాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన సతీమణి ఉషాతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ నెల 18న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా 16న చండిక అమ్మవారి ప్రతిష్ట, రుద్రహోం, సహిత శత చండీ హోమం నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో చండిక అమ్మవారి ప్రతిష్టలో భాగంగా ఆదివారం జరిగిన గణపతి పూజ, పుణ్య వచనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ రామచంద్రయ్య శర్మ, ప్రధాన అర్చకులు దేవగిరి రామన్న, కార్యనిర్వహణ అధికారి రజని కుమారి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీ ప్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.