Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఆదివారం నుంచి ఏపీలో వానలు

0

ఈనెల 18 నుండి గుంటూరు, కృష్ణా, పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ వివరాల మేరకు .. జూన్ 16 వ తేదీన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 17 వ తారీకు మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉండి, మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి. 18 వ తారీకు మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి.

జూన్ 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.

మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. 18 వ తారీకు సాయంకాలం, రాత్రి సమయం నుంచి వర్షాలు మొదలవుతాయి. గుంటూరు, కృష్ణా, పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉంటాయి. కొన్ని చోట్ల భారీగాను, మరికొన్ని చోట్ల మోస్తరుగా నమోదవుతాయి. ఈ వర్షాలు ఉరుములు, పిడుగులతో ఉంటాయి. ఈ వర్షాలు 18 రాత్రి నుంచి 19, 20, 21 వరకు నమోదవుతాయి. 22 వ తారీకు అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయి.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie