మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో రావణాసుర కథానాయికల్లో ఒకరైన మేఘా ఆకాష్ విలేకరులు సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
రావణాసురలో మీ పాత్ర గురించి చెప్పండి?
మా టీం అందరికీ దర్శకుడు సుధీర్ వర్మ గారు ఒక నిబంధన పెట్టారు. ఈ సినిమా కథ గురించి కానీ ఇందులో పాత్రల గురించి కానీ రివిల్ చేయొద్దని చెప్పారు. అందుకే ఇందులో నా పాత్ర గురించి ఎక్కువగా చెప్పలేను. ఇందులో నేను ఒక రిచ్, క్లాసీ అమ్మాయిగా కనిపిస్తాయి. అంతవరకు మాత్రమే చెప్పగలను. మిగతాది సినిమా చూసి తెలుసుకోవాలి.
రావణాసుర ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
సుధీర్ వర్మ గారు ఈ కథ చెప్పారు. కథ చాలా నచ్చంది. అయితే ఇందులో నాది సవాల్ తో కూడుకున్న పాత్ర. ఇది నాకు డిఫరెంట్ రోల్. ఇలాంటి పాత్ర ఇది వరకు చేయలేదు. ఈ ఛాలెంజ్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఒక రెండు రోజులు తర్వాత ఓకే చెప్పేశాను.
మీ పాత్రలో వున్న ఛాలెంజ్ ఏంటి ?
ఇందులో నాది చాలా ఆసక్తికరమైన పాత్ర. కామెడీ, ఇంటెన్స్.. ఇలా అన్ని వేరియేషన్స్ వున్న పాత్ర. ఇందులో కొన్ని సీన్లు వున్నాయ్. అలాంటి సీన్లు నాకు కొత్త. అది సవాల్ గా అనిపించింది. ఈ కథలో నాది కీలకమైన పాత్రే. జర్నీ అంతా చాలా సరదగా సాగింది.
రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
రవితేజ గారు పెద్ద స్టార్. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సెట్ లో నాకు ఏదైనా ఒక సీన్ కష్టం అనిపిస్తే, నాకు వచ్చే వరకు ఎదురుచూస్తారు. డైలాగులు ప్రాక్టీస్ చేయిస్తారు. బ్రేక్ లో ఆయన చెప్పే మాటలు చాలా సెన్సిబుల్ గా వుంటాయి. రవితేజ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనతో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్.
ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?
కథ అంతా చాలా కొత్తగా అనిపించింది. స్టొరీ లైన్ చాలా నచ్చింది. చాలా డిఫరెంట్ గా వుంది. ఓ పెద్ద హీరో ఈ కథని చేయడం సర్ప్రైజ్ గా అనిపించింది.
రావణాసుర గురించి ఒక్కలైన్ లో చెప్పాలంటే ?
టైటిల్ లో ‘Heroes don’t exist’ అన్నారు కదా. అదే ఇందులో చాలా ముఖ్యమైన పాయింట్.