సిపి ఎల్ సుబ్బారాయుడు
కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పాలీసుల ఆధ్వర్యంలో ఈనెల 11న ఉచిత మెగా జాబ్ మేళా ను నిర్వహించనున్నట్లు పాలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా గీతాభవన్ చౌరస్తా సమీపంలోని పద్మనాయక కళ్యాణమండపం ఆవరణలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
10తరగతి ఉత్తీర్ణులై ఇంటర్, ఐటిఐ, డిగ్రీ, పిజి, ఫార్మసి, బిటెక్, యంటిక్, యంబిఏ, యంసిఏ చదివిన అభ్యర్థులు దాదాపు 5వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. విప్రో, జెన్ ప్యాక్, టాటా సర్వీసెస్, హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, ఇండిగో ఎయిర్ లైన్స్ గూగుల్ పే, రిలయన్స్ జియో కంపెనీలతోపాటు దాదాపు 120 ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలను నిర్వహించడం జరుగుతుంది.
ఆసిక్తిగల అభ్యర్థులు పైన పేర్కొన్న విద్యార్హతలు ఉన్నవారు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ జాబిమెళాకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.