పోలీసుల తనిఖీల్లో 200 కిలోలు స్వాధీనం
నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్‌లో అంతరాష్ట్ర గంజాయి ముఠా పట్టుబడింది. 200 కేజీల గంజాయితో పాటు రూ.50 వేలు సీజ్ చేసినట్లు రాచకొండ సీపీ చౌహన్ తెలిపారు.
నిందితులు రాకేష్ చౌహన్, బజరంగ్ సింగ్, పవన్, సవిర్‌రామ్ అరెస్ట్ చేసినట్లు సీపీ చౌహన్ చెప్పారు. ఏవోబీ నుంచి రాజస్థాన్‌కు గంజాయి తరలిస్తున్న గంజాయి ముఠాగా పోలీసులు గుర్తించారు. మరో కేసులో దేవరాజ్ పవార్, సచిన్, సుభాష్ షిండేలను కూడా అరెస్ట్ చేసినట్లు సీపీ చౌహన్ పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్నట్లు అనుమానం వస్తే సమాచారం అందించాలని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.