Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వివాహిత అదృశ్యం కేసు నమోదు

married woman missing case

0

రాత్రి ఇంట్లోనే ఉన్న వివాహిత ఉదయం వరకు ఇంటినుండి కనిపించకుండా వెళ్లిన సంఘటన మనోహరాబాద్ మండలం కళ్ళకల్ లో చోటుచేసుకుంది. ఎస్ఐ కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దర్మేందర్ భారతి గత ఏడాదిన్నర క్రితం కళ్ళకల్ కి వచ్చి నివసిస్తు స్థానిక పరిశ్రమలో పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికే చెందిన నిషాతో వివాహం అయింది.

అప్పటి నుండి కుటుంబంతో కలిసి కళ్ళకల్ లోనే ఉంటున్నారు. రోజూ మాదిరిగానే శనివారం రాత్రి భర్త దర్మేందర్ డ్యూటీ కి వెళ్లగా ఉదయం వచ్చి చూసేసరికి దర్మేందర్ భార్య నిషా ఇంట్లో లేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆదివారం మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ లో భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie