గత ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతం చేశాయి. మన దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి. మన దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. 2017-18లో రూ. 85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన పీఎస్బీలు, క్రమంగా పుంజుకుని 2022-23లో రూ.1,04,649 కోట్ల లాభానికి చేరుకున్నాయి. 2021-22లో ఆర్జించిన సంచిత లాభం రూ. 66,539.98 కోట్ల లాభంతో పోలిస్తే, 2022-23లో ఏకంగా 57 శాతం
పెరిగింది.
లక్ష కోట్ల రూపాయల లాభం ఘనతలో సగం వాటా మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది (ఎస్బీఐ ). ఆ ఆర్థిక సంవత్సరంలో, ఎస్బీఐ, రూ. 50,232 కోట్ల వార్షిక లాభాన్ని నివేదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 59 శాతం వృద్ధిని సాధించింది.శాతం పరంగా చూస్తే, నికర లాభంలో 126% వృద్ధితో రూ. 2,602 కోట్లను సాధించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తొలిస్థానంలో ఉంది. 100% పెరుగుదలతో రూ. 1,862 కోట్ల లాభానికి చేసిన యూకో బ్యాంక్ రెండో స్థానంలో, 94% వృద్ధితో రూ. 14,110 కోట్ల లాభం సాధించిన బ్యాంక్ ఆఫ్ బరోడా మూడో స్థానంలో ఉన్నాయి.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మినహా, మిగిలిన పీఎస్బీలన్నీ ఆకర్షణీయమైన లాభాన్ని ఆర్జించాయి. దిల్లీ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న పీఎన్బీ వార్షిక నికర లాభం 2021-22లో రూ. 3,457 కోట్లుగా ఉండగా, 2022-23లో 27% శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది.ఎస్బీఐ కాకుండా, రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ వార్షిక లాభాన్ని నివేదించిన ఇతర పీఎస్బీలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 14,110 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 10,604 కోట్లు).పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వార్షిక లాభం 26 శాతం (రూ. 1,313 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 51 శాతం (రూ. 1,582 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 23 శాతం (రూ. 2,099 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 శాతం (రూ. 4,023 కోట్లు), ఇండియన్ బ్యాంక్ 34
ప్రిన్సెస్ ఆఫ్ స్లమ్ గా మలీశా.
శాతం (రూ. 5,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం (రూ. 8,433 కోట్లు) లాభాలను సాధించాయి2023 మార్చి త్రైమాసికం/2022-23 నాలుగో త్రైమాసికంలో,
12 పీఎస్బీల సంచిత లాభం 95% పైగా పెరిగి రూ. 34,483 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 17,666 కోట్లుగా ఉంది.అధిక వడ్డీ ఆదాయం, నిరర్థక ఆస్తుల నిర్వహణలో
మెరుగుదల, మొండి బకాయిలు తగ్గడం, పీఎస్‌బీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మూలధనం, ఆర్బీఐ చేపట్టిన సంస్కరణలే ఈ స్థాయి లాభాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.